షష్ఠిపూర్తి (female)

ముడతలేవీ కనిపించకూడదని ఉందా మీ ముఖాన
అయితే అద్దాలు తీసెయ్యండి నిల్చున్నప్పుడు అద్దం ముందున
మీరో రాణి, మీ పళ్ళూ, మీరూ కలిసి పడుకున్నంత కాలం
మీకు ఆరు రోజులు శనివారాలు, ఒక ఆదివారం ప్రతి వారం
 
రాబోయే రొజుల్లో, డబ్బు కన్నా మీకు శక్తి ఎంతో అవసరం
మీకు వెయిట్-లిఫ్టింగ్ అంటే, మీరు కుర్చీలోంచి లేవటం
 
మీ పరివారం తోడుగా రమ్మననకుంటె, అదే ఓ పండగ మీకు
ఎందుకంటే ఇకపై గంట అలుపు, పది గంటలు పరుపు మీకు
 
రహస్యాలన్నీ నిర్భయంగా స్నేహితులతో చెప్పుకోవచ్చిక
ఎందుకంటే ఎవ్వరికీ గుర్తుండి చావదు కనుక
 
మీరు భగవంతుని గుప్పెట్లో గాలి ఆడేలా భద్రంగా ఉండాలి
మీ ప్రేమానురాగాలు మాపై మా పిల్లలపై సదా కురియాలి
 
మీ పుట్టినరోజు సెలబ్రేట్ చేస్తూ ఈ రోజు మా ఆరోగ్యాలు లెక్క చేయకుండా తాగిపెడ్తాం
వందేళ్ళు మీ ఆరోగ్యం కోరుకుంటూ వర్సగా వారం రోజులు తాగుతామని మొక్కుకుంటాం
 
మీకు పెళ్ళి అయిన ఫస్ట్ కిస్ రోజు లాగా
మీకు పిల్లలు పుట్టినప్పడి పండగ రోజులాగా
మీకు మనవడు మనవరాలు పుట్టిన ఆనందపు ఘడియల్లాగా
ఈ అరవయ్యవ పుట్టిన రోజు కూడా పదికాలాలు గుర్తుండిపోవాలి
మీ స్వీట్-హార్ట్-తో మీరు మరెన్నో వాలెంటైన్ డేలు జరుపుకోవాలి
 
ఈ అరవై ఏళ్ళ పండగలాగే, నూటా ఇరవయ్యో పండగ కూడా జరగాలి
ఆ దేవుని ఆశీస్సులతో మీరూ మీ కుటుంబం కలకాలం వర్ధిల్లాలి

Leave your comments

Post comment as a guest

0
terms and condition.

Comments