దీపావళి

శ్రీకృష్ణుడు సత్యభామలతో నరకుడు అంతమైన రోజు 
శ్రీరాముడు సీతాసమేతుడై అయోధ్యాపు చేరిన రోజు
జైనమత ప్రవర్తకుడు మహావీరుడు జనియించిన రోజు
గురు గురుగోవిందసింగ్ బంధీఖానా వదలివెళ్ళిన రోజు
 
ఉదయం ఇంట్లో మగవాళ్ళకు మంగళ హారతుల నివాళీలు
హారతి పళ్ళాళ్ళో ఆడవాళ్ళకు అందే డబ్బుల నజరానాలు
పొద్దున్నే పేణీలు, రక రకాల లడ్డూలు, బాక్సుల్లో మిఠాయిలు
మట్టి ప్రమిదల దీపాల వెలుగుల్లో తొలగే అజ్ణానాంధకారాలు
 
కొత్తబట్టలు, పిండివంటలు, దీపాల వరసల దీపావళులు
నోములు, వ్రతాలు, బంధువుల స్నేహితుల కోలాహలాలు
రంగవల్లులు, రంగోలీలు, మిరుమిట్ల విద్యుత్ దీపాలంకరణలు
సాయంత్రం లక్ష్మీ పూజలు, ఆపై శివకాశి బాణా సంచా కాల్పులు
 
టపాకాయలు, టపాసులు, పటాకాయలు, పటాసులు
కంటికి వెలుగులు, మనసునకహ్లాదాలు ఈ సంబరాలు
ఒక తుస్సుతో ఒక ఢాంతో మొదలయ్యే ఆనందం
నెలరోజుల ముందు నుంచే కాల్పుల శబ్ధం ఆరంభం
 
పొ టాషియం ఇనుపరంద్రంలో పోసి మొలలాంటిది పెట్టి కొట్టే పేలుళ్ళు
సిల్వర్ పేపర్లో ఉల్లిపాయ బాంబులు కొట్టగానే చిల్లిపడే చిన్నరాళ్ళు
మతాబులు, సిసింద్రీలు, చిచ్చుబుడ్లు, తారాజువ్వలు, రాకెట్లు
భూచక్రాలు, విష్ణుచక్రాలు, ఎర్ర మందు బిళ్ళలు, రీళ్ళ గన్నులు
 
పాములు, పెన్సిళ్ళు, కాకరపువ్వొత్తులు, మిరపకాయ లడీలు
సుతిలీ బాంబులు, లక్ష్మీ బాంబులు, హైడ్రోజన్ బాంబులు
గుయ్యిమనే రేట్ల కొనలేనివారికి దీవాలి కావద్దు దివాలా
అందుకే దివ్వెల వెలిగించి ప్రతివారూ వెలగాలి దివ్విటీలా
*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*

Leave your comments

Post comment as a guest

0
terms and condition.

Comments