వయసు అరవై మనసు ఇరవై:

హైటెక్‌ సిటీ ఫ్లైఓవర్‌పై ఈడు అరవై స్పీడందుకుంది
సెకన్ల ముల్లు నిమిషంలో అరవై అడుగులు వేసింది
అరవైఏళ్ల కుర్రవాడి పవర్ అరవైటుదపవర్అరవై అయింది
వచ్చిన ప్రతీ అతిథినీ స్వాగతమంటూ ఆహ్వానిస్తూంది
 
అరవై వయసు నిండింది ఇరవై మనసు ఎగిరింది
అయినా సరే అడుగుల జోరు మాత్రం తగ్గింది
ఏడు మారింది ఈడు పెరిగింది దశాబ్దాలు దాటింది
చేతిలో కర్ర లేకున్నా నడుము కొంచెం సడలింది
 
పించన్ పైస అస్సలు ఫికర్ చెయ్యకు అంది
నడక నేను నాది అడ్డుగోడల కూల్చమంది
కళ్ల చత్వారం కోపం తమాయించు కోమంది
ముఖంలో ముడుత నవ్వుతూ గడపమంది
 
పదే పదే దువ్వి జుట్టు మొదళ్లు కదిలి బట్టతల వచ్చింది
మాడపై అల్లారుముద్దైన మూడు వెంట్రుకలు మిగిల్చింది
బట్టతలల మధ్య హాయ్ అని మరో బట్టతల పలుకరించింది
ఇంపోర్టెడ్ సెంటు వాడినా ఇంకా ముసలి వాసనే కొడ్తోంది
 
అరవైయేళ్ళ వయసు పాతికేళ్ల కుర్రాడిలా తయారైంది
ప్రేమంటే ఇంకా ఆశే తప్ప చెప్పటానికి భాషే లేదంటుంది
ఎదురొచ్చే అందాలను అదేపనిగా ఎగాదిగా చూస్తుంది
కలెక్షన్స్ లేకున్నా సరే మంచిటాకున్న సిన్మాలాగుంది
 
ఈ అరవై కొమ్మల చెట్టుకు కొమ్మ కొమ్మకు కోటిపువ్వులు పూయాలి
అరవై పదుల పండగలా నూటా ఇరవయ్యో పండగ కూడా అదరాలి
ఆ దేవుని ఆశీస్సులతో మీరూ మీ కుటుంబం కలకాలం వర్ధిల్లాలి
*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*

Leave your comments

Post comment as a guest

0
terms and condition.

Comments