పాటల కవి చంధ్రబోస్

ఎదిగిన కొద్దీ ఒదిగే లక్షణం
ఆచరించాలన్న గీత తేజం
సందేశాత్మకం ప్రతి గేయం
చంద్రబోస్ పాటంటే ప్రాణం
 
సరసస్వర ఝరీ గమన కలం
నిలబడింది పాతకాలపు వైభవం
ఉరకలు వేయించే పద ప్రయోగం
తెలుగు మెలోడీకి వన్నెల వైనం
 
మా పాటల రచయిత వేసుకునేది జీన్స్
ఆయన పాట వింటే మెస్మరైజ్ ఆడియన్స్
హ్యాండ్స్ లెగ్స్ షేక్ చేయించే షాకిచ్చే సాంగ్స్
తెలుగుకు వెస్టెర్న్ ఇన్స్పిరేషన్ నో కంప్లైంట్స్
 
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసిన ఘనత
కావాలి మా పెరటి జాంచెట్టు పండ్లతీపిలాంటి చరిత
*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*
 

Leave your comments

Post comment as a guest

0
terms and condition.

Comments