వందేమాతరం శ్రీనివాస్ గారు & మిమిక్రీ శ్రీనివాస్ గారు

వందేమాతరం శ్రీనివాస్ గారు:
జనరంజక ప్రజాబాణీల గాత్ర మాధుర్యం
భావావేశపు ఎర్ర పాటల ఉద్వేగ పరిమళం
భల్-చల్-యేయ్ గొంతులో ఉరుముల రౌద్రం
గుండెల్ని లంఘించి సంధించే వీరంగ సంగీతం
 
అర్ధం కాని వాళ్ళకు విప్లవం ఉధ్యమం ప్రశ్నార్థకం
అర్ధమైతే అది కోటి గొంతుల జన జాగృతి గళం
వచ్చింది ఆసేతుహిమాచల గీతం వందేమాతరం
దిక్కులు పిక్కటిల్లేలా నినదిద్దాం జనగణమనం
 
మిమిక్రీ శ్రీనివాస్ గారు:
ఓకల్ కార్డ్స్-తో ఓలలాడించే హావభావాల ఇంద్రజాలం 
గారడీ ప్రదర్శనల మర్మం విప్పిన సామాజిక వివేకం
శబ్దమాంత్రికుని వినూత్నఅష్టావధాన ప్రయోగం హర్షం
మిమిక్రీ శ్రీనివాస్ శబ్దానుకరణ దృక్పథం ఆరోగ్య వర్షం
 
Vandemataram Srinivas Ji Aur Mimicry Srinivas Ji:
badi door se aaye hain melbourne ki mehfil mein 
logon ke dil beegen hain behethereen gaanon mein
mimicry ki halchal machi australia ki siasat mein
aap hamesha hansaate gaate bane rehna dilon mein
*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*

Leave your comments

Post comment as a guest

0
terms and condition.

Comments