ఖుషీతో ఫిదారా శంకరా! [A Tribute to Tanikella Bharani]

ఓం నమః శివాయః
మా భరణికి సాహిత్యం ఆస్థానం నటన వ్యాపకం
దర్శకత్వం దైవికం, శివుడే జీవితం
తెలుగు సినిమాకి ఆస్కారే నీ లక్ష్యం
నిన్నెప్పుడూ మేం యాది మరువం
 
బస్ మేం ఖుషీతో ఫిదారా శంకరా!
కాలం ఆగదు, జీవితం సాగక మానదు
బ్రౌన్ రైస్ తింటం, గ్రీన్ లీవ్స్ నముల్తం
నీకు నూలు పోగు లేకున్నా సరే
 
మాకు మాత్రం అష్టైష్వర్యాలు ఇవ్వురా
బస్ మేం ఖుషీతో ఫిదారా శంకరా!
చెడ్డోనికి చెడిపోయే కాలమొస్తె
మంచి ఆలోచన ఇచ్చి ముంచేస్తవ్
 
మంచోడికి భాగుపడే కాలమొస్తె
చెడు ఆలోచన ఇచ్చి సెటిల్ జేస్తవ్
నువ్వు శంకర-కమిషన్ ఎప్పుడేస్తవురా
బస్ మేం ఖుషీతో ఫిదారా శంకరా!
 
యుద్దం చేసి దరిద్రాన్ని దగ్దం చేస్త
సచ్చేవరకు అదేపనిగ సంపాదిస్త
అన్నిట్ని అందర్ని పక్కనబెడ్త
పైసలల్లనే పరమాత్మను చూస్త
 
నువ్వు శంకర-కమిషన్ ఎప్పుడేస్తవురా
బస్ మేం ఖుషీతో ఫిదారా శంకరా!
*~*~*~*~*~*~*~*~*~*
 
 

Leave your comments

Post comment as a guest

0
terms and condition.

Comments