
నానమ్మ పుట్టినరోజు
మీరు మీ మనవళ్ళతో కలిసి టట్టూలు వేసుకోవాలి
మీరు మళ్ళీ చిన్నపిల్లలా మారి ఎంజాయ్ చేయాలి
మీ ప్రేమానురాగాలతో మేం సంతోషంగా గడుపుతున్నాం
మీరూ మీ మనవలు మనవరాండ్రతో హాయిగా ఉండాలని కోరుతున్నాం
మీరు ఊదలేకపోతే బర్త్-డే క్యాండిల్స్
ఊది పెడతారు గ్రాండ్-చిల్డ్రెన్ ఏంజెల్స్
ఇప్పుడు తాతయ్య రాత్రి చాలా లేట్-గా వస్తాడనే బెంగలేదు
చూసిన సీరియలయినా సినిమా అయినా గుర్తుండదు గనుక ఫరక్ పడదు
మీ పుట్టినరోజు సెలబ్రేట్ చేస్తూ ఈ రోజు మా ఆరోగ్యాలు లెక్క చేయకుండా తాగిపెడ్తాం
వందేళ్ళు మీ ఆరోగ్యం కోరుకుంటూ వర్సగా వారం రోజులు తాగుతామని మొక్కుకుంటాం
మీరు భగవంతుని గుప్పెట్లో గాలి ఆడేలా భద్రంగా ఉండాలి
మీ ప్రేమానురాగాలు మాపై మా పిల్లలపై సదా కురియాలి
మీకు పెళ్ళి అయిన ఫస్ట్ కిస్ రోజు లాగా
మీకు పిల్లలు పుట్టినప్పడి పండగ రోజులాగా
మీకు మనవలు మనవరాండ్రు పుట్టిన ఆనందపు ఘడియల్లాగా
ఈ ఎనభయ్యవ పుట్టిన రోజు కూడా పదికాలాలు గుర్తుండిపోవాలి
మీ స్వీట్-హార్ట్- తో మీరు మరెన్నో వాలెంటైన్ డేలు జరుపుకోవాలి
*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*
Leave your comments
Post comment as a guest