
భుజం భుజం దూరమైపోయే
ఇవాల్టి రోజున ఇత్-నాన్- గా ఉన్నా
రెండొద్దులల్లో ఏమయితదో నన్నా
గడిచే ప్రతిరోజూ నీది కాదన్నా
జర పదిలం భద్రం గుండన్నా
బంధాలు కరిగే మనుషులల్లో
దూరాలు పెరిగే మనసులల్లో
రక్త బంధం పల్చబడి పోయే
సమయం డీలా పడిపోయే
విలువలన్నీ లోతుకి జారిపోయే
జ్ణాపకాలు నెమరేసుకు బతకాలే
అమ్మనోటి ఆశీర్వాదంతో కదులు
కన్నతండ్రి కష్టమెరిగి వెయ్యడుగు
కట్టుకున్నదాని తోడుగా నడువు
నిన్ను తెల్సుకుని అడుగేస్తే జడవ్వు
*~*~*~*~*~*~*~*~*~*~*
Leave your comments
Post comment as a guest