
తిరిగి తిరిగి నన్నే చూసింది
ఆమె తిరిగి తిరిగి నన్నే చూసింది హాయ్-హాయ్
బతికుండగానే చూపుల్తో చంపేసింది హాయ్-హాయ్ |ఆమె|
కలలరాణి చేసింది నన్ను హైరానా హాయ్-హాయ్
గుండెగూటిలో కూచుంది నా మైనా హాయ్-హాయ్ |ఆమె|
లిఫ్ట్ ఎక్కితె గుంపుగా జనముంది హాయ్-హాయ్
పక్కకు చూస్తే నన్నంటుకుని ఉంది హాయ్-హాయ్ |ఆమె|
పరికిణీలొ పగలబడి నవ్వింది హాయ్-హాయ్
పట్టులంగా పరేషాను చేసింది హాయ్-హాయ్
పిడికిట్లో నా గుండెనేసి పిసికింది హాయ్-హాయ్
నాకు ఊపిరి ఆడకుండా చేసింది హాయ్-హాయ్ |ఆమె|
సినిమా కెళ్తే నవ్వుతూ కనిపించింది హాయ్-హాయ్
అక్కడే వెంబడెవ్వరున్నది తెలిసింది హాయ్-హాయ్
చెప్పాలన్నది కళ్ళతోనే చెప్పింది హాయ్-హాయ్
అప్పుడే నేనక్కణ్ణుంచి జారుకుంది హాయ్-హాయ్ |ఆమె|
*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*
Leave your comments
Post comment as a guest