పిచ్చి ఆత్మహత్య

నవ్వించాలని అనుకుంటే కవి ఎవ్వరినీ విడిచి పెట్టడు
తలపై గురిపెట్టి తనమీదే జోకుల తూటాలు పేలుస్తాడు
ఆస్కర్ అవార్డ్-కు నామినేట్ కాలేదు
ఒబామా ఒలెంపిక్స్-కు పిలువలేదు
 
కవిని నేను నేనేమన్నా అంటా బల్ల గుద్ది
మాటలు అర్థం చేసుకోర్రి మీ కపాలం కొద్ది
రాళ్ళు పట్టుకొస్తే సేఫ్టీకోసం మోడీ దగ్గర తల దాచిపెట్టొస్త
కర్రలతో వస్తె మంటబెట్టి పుర్రెలతో మసాలా పులుసుబెడ్త
 
నేను ఒంటరిగా ఉండలేను నువ్వూ ప్రేమించి చూడు
గుంపును చూస్తే భయపడేలా చేసింది ప్రేమ గోడు
ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకున్నాను
ఈ జీవితాన్ని భరించలేనని అందరికీ చేప్పాను
 
దోస్తులంతా మరింకా ఆలస్యమెందుకు అన్నారు
బంధువులు ఆలోచించుకున్నది చెయ్యమన్నారు
శ్రేయోభిలాషులంతా అమలు చేసెయ్యమన్నారు
కుటుంబంలో వాళ్ళు భీమాచేస్తే మంచిదన్నారు
 
ఆత్మీయులు వీలునామా రాసేసి పొమ్మన్నారు
దగ్గరోళ్ళు మేం భాద్యులం కాదని కాగితమడిగారు
అయ్యగారు చావడానికి మంచిరోజు అక్కర లేదన్నాడు
చెప్పి చచ్చే చావు కుక్కచావు కంటే మంచిదన్నాడు
 
వెంబడే నేను నాలో ఆత్మను నిద్ర లేపాను
సరదాగా అన్న మాట చావుకు గుడ్-బై చెప్పాను
కోణ్ణి కోసి రెండు పెగ్గులేసి సిన్మా చూస్తూ నవ్వుతూ కలలోకి జారాను
నేను నిండునూరేళ్ళు బతకాలని నా వాళ్ళే స్కెచ్ చేశారు ఈ ప్లాను
 
సగం పిచ్చి లేస్తె శాయర్ అవుతరు
పూర్తి పిచ్చిలేస్తె శాయరీబుక్ రాస్తరు
మామా రంగంలో సింగంలా దిగితేనే రచ్చ రంబోలా
రంగుల లైలాతో హంగామాగా చేసెయ్ గోవాలో గోల
*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*

Leave your comments

Post comment as a guest

0
terms and condition.

Comments