ఆస్ట్రేలియాలో తెలుగు కార్యక్రమం

జీవితం ఒకటే కానీ, తెలుగు కార్యక్రమం మరుజీవితమంత ఆనందం తెస్తుంది
ఆస్ట్రేలియాలో ప్రతి నగర అవని తెలుగుదనం ఏదో ఓ హాలున వెల్లి విరుస్తుంది
చూసే కళ్ళకు నాలుక ఉంటే ఆ వర్ణన కొండంతలు
పలికే నాలుక్కే కళ్ళుంటే నయనానందం రెండింతలు
 
పాఠశాల సెలవుల్లో తెలుగు చిన్నారుల పూర్వాభ్యాసాల సందడులు
పూర్తి వేషభాషల్లో అభినయాలను ప్రోత్సహిస్తున్న అమ్మానాన్నలు
తెలుగు, ఇంగ్లీషు, తెంగ్లీషు సంభాషణల్లో నేటి యువత
భాషలో మరో హంగును సంతరించుకున్న తెలుగు నవత
 
బుద్ధిమంతులు, పోకిరి, కంత్రి, దేశముదుర్లు
చిలక్కొట్టుడు చిన్నోళ్ళు ఆస్ట్రేలియా కుర్రోళ్ళు
అనుష్క, తమన్నాల్లా - ఎవరెస్టులు మా ఆడ పిల్లలు
మెల్బోర్న్ మెరుపులు, మెరిసే తారలు ఈ రాచిలకలు
 
మల్లీశ్వరి, మిస్సమ్మ, బంగారు తల్లులు మా ఆంటీలు
సరదా రాముడు, సంబరాల రాంబాబులు మా అంకుళ్ళు
ఆస్ట్రేలియాలో ప్రతి నగరాన తెలుగు ఉత్సవాలు
ఆటపాటల్లో, అభినయాల్లో తెలుగు తేజాలు
 
అందాల దుర్గంలో ఆడపిల్లల నృత్యాలు
కంగారూల నేలపై హిందోళంలో నెమళ్ళు
చలి గాలికి వేడి పుట్టించే స్తానికుల సంగీతం
కాలాన్ని కదలనీయని యువ కలువల గాత్రం
 
భారతీయ సంస్కృతి ఆస్ట్రేలియా ఆడుగులకు అద్దిన మహత్వం
సంవత్సరం వేచినాసరే తదుపరి అవుతుంది ఓ మధుర జ్ణాపకం
రంగస్థలాన్ని మెప్పించాలన్న ప్రతి ఒక్కరి కృషికి అభినందనం
అంతా కలిసి ఒకే వేదికపై కలిసే వైనం ఎదగాలి దినం దినం
 
పడతారు గొడుగులు తెలుగు సాహిత్యానికి సైతం
చాట్ బండార్ లో తిని సెల్ ఫోన్ లో చాటింగంత ఆనందం
తిప్పి చెప్పినా సూటిగా చెప్పినా ఇది చెప్పాలనుకున్న నిజం
తెలుగు భాషా రసజ్ఞులకు ఆస్ట్రేలియా తెలుగు వారి సుస్వాగతం
*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*

Leave your comments

Post comment as a guest

0
terms and condition.

Comments