
తెలుగు అస్సోసియేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా ఇంకార్పొరేటెడ్ (TAAI - తాయి)
తాయి సంఘం 1992 ప్రారంభం
సంస్కృతీ సంప్రదాయాల మేళవం
22 ఏళ్ళ తెలుగు జనజీవన భాగ్యం
తదుపరి తరాలకు ఆదర్శ ప్రాయం
జనరంజని, జజ్జనకల హోరు
రస రాగ సుధ ఆటల జోరు
పిక్నిక్ ఉగాది వేడుకల తీరు
స్వరసాహిత్యాల తెలుగు వారు
సంఘ సేవకై చేస్తాం రక్తదానం
వాకింగుల్లో చూపుతాం సంఘటితం
సికా సిక్కా కలుపుతాం
ఒక పక్కా సేవకు వాడుతాం
మేము తెలుగు నేలకు చాలా దూరం
అందుకే తెలుగు తీయదనం మరవం
మా సంకర తెలుగు వంకర పోదు
శంకరశాస్త్రిలా శారదా అనేది లేదు
బహిరంగ సభల రచ్చ లేదు
అవినీతి పాలన బెంగ లేదు
జీహుజూర్ గాళ్ళ జాడలేదు
కుండలో పుట్టినా కులప్రసక్తి రాదు
బాక్స్ బద్ధలు చేసేది లేదు
సీన్ సితార అయ్యేది కాదు
కష్టే ఫలే ఇక్కడి నిత్య జీవితం
వైవిధ్యాలెరుగదు మా వర్తమానం
తెలుగు వారి తాయి ఔన్నత్యం
ఆస్ట్రేలియా అంతా చాటుతాం
*~*~*~*~*~*~*~*~*~*~*
Leave your comments
Post comment as a guest