
పిలక - ఓ కవిత
మా తాత పిలక పంచదార చిలక
పంచ కట్టుకు నాల్గు పరకల పిలక
నిలువు బొట్టుకు నాట్యమాడే పిలక
నాలుగు వేదాల నాణ్యమెరిగిన పిలక
రైతు పైరులో తోట నిగనిగల అరటి పిలక
పెండ్లి పెట్టెలో ఆకులు వక్కల కంద పిలక
సొంతింట్లో జెడ్ క్యేటగిరి భధ్రతలేని పిలక
మీసాల్లేని పోతనకు రొయ్యమీసాల పిలక
చిలిపి కళ్ళతో షికార్ల మలప రాముల పిలక
తెగులు సోకిన గ్రంధసాంగుల శృంగార పిలక
అందాల నారగించుటలో నేటి యువత పిలక
జుట్టైనా గుండైనా తికమక కానీయదు పిలక
పిలకజెళ్ళ గీత రెండుజెళ్ళ సీత మెచ్చే పిలక
వన్నెల చిలక వెన్నెల మొలకా నచ్చే పిలక
*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*
Leave your comments
Post comment as a guest