
షష్ఠిపూర్తి (male)
ముసలితనం వచ్చిందనడానికి మూడే ఉదాహరణలు
మొదటిది మరచిపోవడం రెండవది మరచిపొవడం మూడవది మరచిపొవడం
మీ బార్య పేరు మరచిపోతే అదో పెద్ద చిక్కు
అందుకే డార్లింగ్ ఏమోయ్ అని పిల్చుకుంటే బెస్ట్
ముడతలేవీ కనిపించకూడదా మీ ముఖాన
అయితే అద్దాలు తీసెయ్యండి అద్దం ముందున
మీరో కింగ్ మీ పళ్ళూ మీరూ కలిసి పడుకున్నంత కాలం
మీకు ఆరు శనివారాలు ఒక ఆదివారం ప్రతి వారం
రాబోయే రోజుల్లో డబ్బు కన్నా మీకు శక్తి అవసరం
మీకు వెయిట్ లిఫ్టింగ్ అంటే మీరు కుర్చీ లోంచి లేవడం
మీ అద్దాలు మీ జేబులో ఉన్నా వెతుకుతారు ఓ అరగంట
మీకున్న చెడు అలవాట్లన్నీ మానినా సరే ఇంకా మీకు ఏదో ఓ తంటా
మీ బార్య తోడు రమ్మని అనకుంటే పండగ అదే మీకు
ఎందుకంటే ఇకపై గంట అలుపు పది గంటలు పరుపు మీకు
రహస్యాలన్నీ నిర్భయంగా స్నేహితులతో చెప్పుకోవచ్చిక
ఎందుకంటే ఎవ్వరికీ గుర్తుండి చావదు కనుక
వయసు బరువు షుగర్ ఇవన్నీ బయటపడేయండి
అవన్నీ డాక్టర్-కే వదిలేయండి
తోచినదల్లా నేర్వాలి, మెదడుకు పదును పెట్టాలి
అందులోకి అల్జీమర్స్ అనే దయ్యాన్ని రానీకుండా చూడాలి
అరోగ్యమే మహాభాగ్యం కాపాడుకోవాలి పదిలంగా
బాగాలేకుంటే సరిచేసుకో శీఘ్రంగా
ఆదీనంలో లెకుంటే డాక్టర్-ని కలుసుకో వేగంగా
ముసలితనం వచ్చిందని ఆపొద్దు నవ్వడం
మరింత ముసలోళ్ళవుతారు ఆపితే నవ్వడం
Leave your comments
Post comment as a guest