మెల్బోర్న్ భువనవిజయం బృందం

గురువులు శ్రీ యస్ పి చారి గారికి:
భువనవిజయ గణ భావేశాగ్ని ప్రేరణం కర్తవ్య ప్రభావితం
సాహితీ చతురత్వం పదనిర్ధేశకత్వం పధ్యోత్సాహ మార్గం
సంస్కృతీ సంప్రదాయాల పరి పూర్ణ వ్యక్తిత్వ వికాసం
భాషాతేజం అత్యంత ఆప్తం గురుశ్రీ  శేషం పురుషోత్తమం
గురువుల ఆశీర్వాదం శిష్యులపై శుభాల వర్షం
కలకాలం తోడవ్వాలి అక్షరసుమాల అనుగ్రహం
Saripalle Bhasker Rao Garu:
తెల్లకోటలో తెలుగోళ్ళతో పంచుకున్న విన సొంపైన పద్యం తాత్పర్య సహితం 
డూడూ బసవన్నా పెద్దయ్యకు పెట్టు అందరి తరఫున గణగణగంటల దండం
తెలుగు మల్లి మల్లిక్ సౌరభానికి:
కాల్వగట్టున సాహిత్యమే జపము తపము యాగము కొంచాడకు
వర్ణమాల చెరకు పండించి తీపిని పంచే రైతుబిడ్డ కవి మిత్రులకు
రమణీయ పద తోరణాల పద్య బ్రహ్మ సరిపల్లె:
సాహిత్య ప్రతిభా జీవన వ్యక్తిత్వాల అక్షరసమామ్నాయం సాహితీ సరిపల్లె
ప్రాచీన హోదా భాషాశాస్త్ర పద్య విశిష్టతల మిడిసిపడింది భువనవిజయ రేపల్లె 
Ramprakash Yarramilli saab:
సున్నిత పరిశీలన సారూప్య వర్ణన
11 కవితలు, 1 కధానిక రచన: మురళి
ధర్మపురి
రాంప్రకాష్ యర్రమిల్లి గారి స్పందన
Saripalle Suryanarayana saab:
వేంకట కవులకొక్కళ్ళకే చెల్లునా అవధానం
పద్యగానామృతం సరిపల్లె వారి అక్షర క్రమం
Ragu Vissamraju Ji:
సంగీత సాహిత్య కళా ప్రేమి అక్షరశిల్పి
రాగ తాళ శాస్త్రీయ ప్రయోగ స్వరశిల్పి
Sudhir Mandalika Ji:
కవితల్లో కల్పనలు కల్పనతో కవితలు
ఆ ప్రేమ కలపు చిటపట చినుకులు
చిలికే మన్మథ మంత్రాల అక్షరాలు
Yogi Walthati:
కుర్రో కుర్రు, కొండ దేవర పలుకుతాండు, ఉన్నదున్నట్టు సెబుతాండు..
ఎక్కడో ఎందుకు జూస్తవ్, ఓ సారి అటుకెల్ల సూస్కో మస్కా తెల్ల పోరుంది..
జర్ర నిన్ను పక్కకి రమ్మంటుంది, రథసప్తమిని రససప్తమి చేస్తనంటుంది
ఇంటిలోన పోరు ఇంతింత కాదయా అని బాదపడే యోగిగారినే కావాలంటుంది
ఇలా వ్రాసే మాండలీకాల మర్మయోగి
అక్కో నీ బాంచను మాంత్రీకుడు యోగి
Venugopal Rajupalem garu:
గుండె లోతుల్లోంచి వెల్లువలా పొంగుకొచ్చే భావం అద్భుత సాహిత్యం
అవగతం చేసుకుని ఆలపించిన కమ్మని గాత్రం వేణురాజుపాలెం
*~*~*~*~*~*~*~*~*~*~*~*~*

Leave your comments

Post comment as a guest

0
terms and condition.

Comments