ఆంజనేయ భజన

సాకి:
గ్రహబాధల తరిమికొట్టి  ఊరిని కాపలా కాయు
లంకిణంత సమస్యైనా తోక చుట్టి కూల్చివేయు
పల్లవి:
సింధూరపు మారుతీ నీవే మా కధిపతి
నీ గుండెలో రాముడు నువ్వే మా దేవుడు
చరణం 1:
అంజనమ్మ కడుపు పంట రవిని మింగి గెంతెనంట
కిష్కిందా యోగి అంట సుగ్రీవుని మిత్రుడంట
పైరులెన్నొ పండేనంట ప్రతిరోజో పండగంట
గొంతెత్తి పాడమంట చెక్కభజన లాడమంట
చరణం 2:
వారధినే దాటినోడు లంకిణిని గూల్చినోడు
లంకను గాలించినోడు సీతమ్మను కలిసినోడు
ఉంగరం ఇచ్చినోడు చూడామణి తెచ్చినోడు
లంకాపురి కాల్చినోడు లక్ష్మణ్నను గాచినోడు
చరణం 3
అఙ్ఞానాన్ని దించేవాడు
ఆర్గురు శత్రుల తరిమేవాడు
సువర్చలతో కూడినవాడు
కాచే బ్రోచే దొరనే వీడు
పల్లవి
అంజనమ్మ కడుపు పంట రవిని మింగి గెంతెనంట
కిష్కిందా యోగి అంట సుగ్రీవుని మిత్రుడంట
పైరులెన్నొ పండేనంట ప్రతిరోజో పండగంట
గొంతెత్తి పాడమంట చెక్కభజన లాడమంట
*~*~*~*~*~*~*~*~*~*~*~*

Leave your comments

Post comment as a guest

0
terms and condition.

Comments