వేణుగోపాల భజన

సాకి :
శ్రీ వేణుగోపాల పరబ్రహ్మణే నమః
దేవకీవసుదేవ సుతం దేవం కృష్ణం వందే జగద్గురుం
పల్లవి:
ఇరువైపుల గోవులతో మువ్వ గోపాలుడు
చేతులలో మురళితో వాడలకు వచ్చినాడు
మూటలొద్దు ముల్లెలొద్దు ముద్దిమ్మనె గోపెమ్మ
నేను నీవె మేను నీదె రా రమ్మనె ఓ కొమ్మ
చరణం 1:
కన్నుల కెరుపొచ్చెను చెక్కిలి నలుపెక్కెను
దొండపండు పెదవులు గంట్లు కావాలనెను
కొక్కొరో కో యనుచు తొలి కోడి గూసెను
ముంత దాచకుండ నేను చల్ల కొచ్చినాను
చరణం 2:
బిగి రవిక పిగిలె కౌగిలికి వేళెందుకురా
ఒంటరిగానే రారా వెంట ఒకతి వద్దురా
జంటగా నువ్వుంటే ఏ తంటా లేదురా
భామల పొందే నీకు వైకుంఠ మాయెరా
చరణం 3
గడపదాటితే నువ్వు నా వాడివి కావురా
మసి బూసి మారేడుగాయ జేయొద్దురా
వెన్నా అన్నిట నిన్నే నిష్ఠురమాడెదరా
వలచిన వనితను చులకన చేయకురా
Fast Beat:
మాధవ గోపాలా కేశవ గిరిధర శ్యామా ముకుందా
నందనందా దీనబంధా బృందావన రాధే గోవిందా
*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*

Leave your comments

Post comment as a guest

0
terms and condition.

Comments