బతుకమ్మ

పరమశివుని ముద్దు గుమ్మ
తీరొక్క పూల పసిడి బొమ్మ
జానపద బాణీల తెలుగమ్మ
జగన్మాత సద్దుల బతుకమ్మ
 
పెత్రమాసతో మొదలయ్యే పర్వం
పూర్వీకులను స్మరించే తరుణం
పెద్దలకు చిల్లు గారెల నైవేద్యం
అంబరమంటె ఇంటింట సంబరం
 
ఎంగిలి బతుకమ్మ సౌందర్యం
అశ్వయుజ మాసపు సోయగం
సొంపైన పదసంపద గానసంద్రం
జీవన గీతాల యాస మధురం
 
పసుపుకుంకుమల పదనిసల క్షణం
బేధాలు మరచి మహిళల నృత్యం
చామంతి తంగేడు మందార కిరీటం
పూలరాసులతో గౌరమ్మ నిమజ్జనం
*~*~*~*~*~*~*~*~*~*~*

Leave your comments

Post comment as a guest

0
terms and condition.

Comments