మా అమ్మమ్మ పుట్టినరోజు

రెండ్రోజుల్లో రెండేళ్ళుగా పెంచుకునే పరిచయం
ఆత్మీయంగా మాట్లాడే అరుదైన స్నేహం
కొందరికి అమ్మ, ఇంకొందరికి అత్తమ్మ
మరికొందరికి బామ్మ, ఎందరెందరికో అమ్మమ్మ
 
ఎవరు ఎలా ప్రవర్తించినా ప్రశాంతంగా ఉంటుంది
పుస్తకాలతో బాటు మనస్తత్వాలు చదువుతుంది
అమ్మమ్మది రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి
తాతది తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయల కీర్తి
 
అత్తలేని కోడలుత్తమురాలు అన్నారు
మేనత్తలేని కోడలుత్తమురాలు అనలేదూ
అత్తలేని అల్లుడు ఉత్తముడు అనలేదు
అందుకే ఆది అంత్యనిష్ఠూరాలతో పనిలేదు
 
కంప్యూటర్ గేం-కు గుడ్మార్నింగ్ అంటుంది
టీవీ సీరియళ్ళతో గుడ్-నైట్ చెబుతుంది
తెలుగు బుక్స్ అమితంగా చదువుతుంది
పత్తాలంటే రాత్రంతా జాగారం చేస్తుంది
 
 
ఈ కాలం పిల్లల వైనం వింటేనే ఓ విడ్డూరం
గడ్డం ఉన్నోళ్ళందర్నీ బాబాలు అనుకుంటారు
గాంధీ పూర్తిపేరేంటంటే చాచానెహ్రూ అంటారు
జనగణమన రాసిందెవరంటే చంద్రబోస్ అంటారు
 
ఆప్కానాంక్యాహై అంటే అభీఖానాఖాయా అంటారు
అందుకే అమ్మమ్మ ఉంటే ఆ సంగతులే వేరు
మంచి విషయాలతో మనవలందర్నీ అలరిస్తుంది
మురిపించే కబుర్లతో కాలాన్ని కరిగిస్తుంది
 
ఎప్పటికీ ఆమే మకుటంలేని మహారాణి
మనవలు మనవరాళ్ళ మధ్య యువరాణి
ఆమె మనసులో ఉండదు మాయామర్మం
ఆ ఆప్యాయమైన పలకరింపు అతిమధురం
 
ఆమె కురిపించే ప్రేమాభిమానాలకు కొడదాం జేజేలు
శ్రీమతి అమ్మమ్మకు 84వ పుట్టినరోజు శుభాకాంక్షలు
అమ్మకడుపు చల్లగా అత్తకడుపు చల్లగా బ్రతకాలి వెయ్యేళ్ళు
ఈ రోజు వచ్చిన మీ అందరికీ బోలెడు ధన్యవాదాలు
 
*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*

Leave your comments

Post comment as a guest

0
terms and condition.

Comments