గృహప్రవేశం

పెద్ద చేంతాడు బొక్కెన గిఫ్ట్ తెచ్చాము నీళ్ళు చేదుకోడానికి
ఆ చేంతాడు రాపిడికి మీ చేతులు కాయలు కాయడానికి
మీ బావికి గిలక బాగుంటే మీకు సరిపోయేలా వాడకానికి
మీరు రోజూ భుజం మీద బిందెలతో నీళ్ళు మోయడానికి

పెరటి గుమ్మం ముందే తులసి కోట కట్టండి
తులసి కోటకు చుట్టూ ఓ అరుగు వేయండి
వాకిట్లో ఇత్తడి గంగాళంలో నీళ్ళు ఇత్తడి చెంబు పెట్టండి
హాల్-లో ఇనుపగొలుసులతో ఉయ్యాల బల్ల ఊగండి
 
ముక్కోణపు గూళ్ళలో సంధ్యాదీపాలు వెలిగించండి
ఇంటి ముందు దేవాలయం ఉండకూడదు
దేవాలయపు నీడ ఇంటిపై పడకూడదు
రోటిపైన కూర్చోవద్దు రోలును బోర్లించొద్దు
 
గడప మీద నిలబడి తుమ్మవద్దు
సంధ్యాసమయంలో భోజనం చేయొద్దు
జడకుప్పెలు జడబిళ్ళలతో మీ అమ్మాయిలు మెరవాలి
దాగుడుమూతలు ఆడాలి బొమ్మలపెళ్ళిల్లు చేయాలి
 
ఎదిగి చెమ్మచెక్కలు కోలాటాలు గళ్ళాటలు ఆడాలి
మీరూ మీఆవిడా పచ్చీసాటలు గచ్చకాయల్లో మునగాలి
మీకు పంచెకట్టు తలపాగా చెవుల పోగులు కాళ్ళ కడియాలు
మీ ఇంట జరగాలి పద్యపఠనాలు గానాబజానాలు నృత్యాలు
మీ ఇల్లమ్మ ఇష్టదైవాన్ని కులదైవాన్ని స్మరించుకుంది
ఆ పితృదేవతల ఆశీర్వాదంతో ఈ గృహప్రవేశం అధిరింది
 
May your house flourish with walls of love and dreams of beams
May your house be too small to hold all our friends
We all wish that every room in this house fill with laughters
We all wish that every window of this house open lots of possibilities
 
*~*~*~*~*~*~*~*~*~*~*~*~**~*~*~*~*~*~*~*~*~*~*~*

Leave your comments

Post comment as a guest

0
terms and condition.

Comments