
బార్య 50వ పుట్టినరోజు
చిన్నప్పుడు చీకటంటే భయం
కాలేజీలో ఎక్జామ్స్ అంటే భయం
పెద్దయ్యాక కుక్కంటే భయం
మరిప్పుడు టీవీలో కుక్కరిచినా భయం
భయాన్నే శక్తిగా మలచుకుంది
మా ఇంట్లో కుక్కను మాత్రం భరిస్తుంది
మగాళ్ళు వంట చేయడం మా ఇంటా వంటా లేదు
నాకు తిని పెట్టడం తప్పించి కాఫీ పెట్టడం కూడా రాదు
అన్నం వండడానికి కావాల్సిన పదార్థాలు చేసే విదానం చదివాను
ఒక సారి అన్నం వండి రెండు సార్లు చేతులు కాల్చుకున్నాను
ఇదేం వంటనే అని చక్కగా దెప్పు తుంటాను
ఎంత రుచిగా వండినా ఏదో ఓ వంక పెడతాను
అలా అంటేనే ఆడాళ్ళు వంట బాగా చేస్తారని విన్నాను
గొంతు వరకు తిని గురక పెడుతూ పడుకుంటాను
మా బార్య కళ్ళు కమలాలు
మా బార్యవి నెమలి చూపులు
మా బార్య ముక్కు చిలకముక్కు
మా బార్య నోట కోకిల పలుకు
మా బార్య నడక హంస నడక
అందుకే నేనెప్పుడూ ఆమె వెనుక
ఒక్క మనిషి పోలికా లేదు అనుకునేరు
మనుషుల్లో దేవతలు ఇలానే ఉంటారు
మా ఆవిడ బంగారం, లవ్ యూ బంగారం
కార్డియో ఎక్సర్సైజులు చేయండి విటమిన్లు వాడండి
ఆరోగ్యము ప్రశాంతత లతో రానున్న జీవితం గడపండి
యాభై ఏళ్ళ జీవితాన్ని చూసిన వాళ్ళం ఇంకెక్కడి భయం
నీ వందేళ్ళ పండగ రోజు కలిసి డాన్స్ చేద్దాం మనమందరం
మరపురాని పెళ్ళినాటి ప్రమాణాలు
అలుపురాని నూరేళ్ళ ప్రయాణాలు
నిజమవ్వాలి నీ నా మనిద్దరి కలలు
ప్రశాంతంగా ఉండాలి పది కాలాలు
Leave your comments
Post comment as a guest