
మామ భామ
మామకు ఇల్లాలు ఫొటో పర్సులో
ప్రియురాలు ఫొటో మనసులో
మామ ఆశ భామను తాకాలని
భామ పక్కకు జరిగింది ఇది ఏదోలా ఉందని
భామకు తొందర తలుపులేసి తయ్యారవ్వాలని
మామ ఆశంతా ఆ గదిలో దూరాలని
ముందు ముందు వెళుతుంది భామ
వెనక వెనక పరుగెడుతాడు మామ
కన్ను కొడుతుంటాడు మామ
కళ్ళు తిప్పుకుంటుంది భామ
భామకు షేక్-హ్యాండిచ్చి చేతిలో చేయి కలపాలని
అందరికీ షేక్-హ్యాండ్-లిచ్చాడు ఇష్టం లెకున్నా కాని
నీ కొసం తాజ్ మహల్ కడతానన్నాడు మామ
ముందు నీ కొసం రెండు గదుల ఇల్లు కట్టుకో అన్నది భామ
తమలపాకులో సున్నం రాసి పాన్ అని చేతికిచ్చాడు మామ
సున్న పక్కన సున్న పెట్టి సున్నం గొట్టకు అంది భామ
జమానా మారింది, ట్రెండ్ మారింది - నువ్వూ మారాలి అన్నాడు మామ
సమాదిలో కాళ్ళున్నా సరే, శ్మశానంలోకొచ్చే ఆడాళ్ళనే చూస్టుంటావంది భామ
అనుమతిస్తే నీ బాహువుల్లో కన్ను మూయాలని ఉంది అన్నాడు మామ
తాజ్ మహల్ కట్టినా కూడా ముంతాజ్ తిరిగి రాలేదని అన్నది భామ
నీ రాతి గుండె నా ప్రేమ కోసమైనా కొట్టుకోదా అన్నాడు మామ
గుండెను నిజంగానే రాయి చేసుకుని గుండుపై ఒక్కటిచ్చుకుంది భామ
భామే మామను బలంగా మార్చింది
భామే మామకు బలహీనతగా మారింది
Leave your comments
Post comment as a guest