దుష్టచతుష్టయం

సుయోధనుడు రారాజు కర్ణుడు సామంతరాజు
దానంలో రారాజే కాదు మారాజు అంగరాజు

శకుని మర్మం ముదనష్టపు కెలుకుడు
అల్లుళ్ళ అంతం చూసేందుకే గిల్లుడు
 
మనిషి జీవితం స్నేహితులతో ఎంతో ప్రభావితం
దుర్యోధనుడు శకునిని కర్ణుని అనుసరించడం
 
దుశ్శాసనుడు వలువల లాగే దురాగతం
నిండుసభన మానవిలువల వస్త్రహరణం
 
ధృతరాష్ట్రుడు బౌతికంగా అంధుడు
దుర్యోధనుడు నైతికంగా అంధుడు
 
భీష్మ ద్రోణ విదురులంతా నిర్వీర్యం
దుసటచతుసటయ దుష్టచతుష్టయం
 
*~*~*~*~*~*~*~*~*~*~*~*

Leave your comments

Post comment as a guest

0
terms and condition.

Comments