అక్షర ఎవరంటే..!!

మెల్బోర్న్ భువనవిజయ బృందం 
అక్షర సమితి ..
తెలుగు భాషా భావాల ఫలహార గంప
అక్షర సమితి
గుండెల్లో ప్రేమికుని అనురాగానికి
అక్షర అభిసారిక
భాషకు సరికొత్త శ్రీకారం చుడితే
అక్షర అభ్యాసం
బడినే గుడిచేసి విధ్య అభ్యసిస్తే
అక్షర ఆయుధం 
అఙ్ఞాని బుద్ది బూజు దులపలేం ఇది 
అక్షర సత్యం
లోకం తీరు ఒక్క ముక్కలో  చెబితే
అక్షర యజ్ఞం
అందం అంతరంగంలో ఉండాలనేది
అక్షర పాఠం
పదాలు కలుసుకుని పదనిసలు పలికిస్తే
అక్షర క్రమం
ఆత్మీయులు దూరమైతే ఆగిపోయేది
అక్షర ప్రసరణం 
కవితా పరిచారికలను కరమున బంధిస్తే
అక్షర యశస్కులు
అక్షర యశస్కులు కాలంలో కలిస్తే
అక్షర నివాళి
కూలీలు మొత్తం అక్షరాస్యులుగా మారితే
అక్షర ఉద్యమం 
ప్రతి అక్షరంలో ఒక నక్షత్రం చూడడం
అక్షర పరిమాణం
మీరు అడిగిన ఈ ప్రశ్నకు నా జవాబు
అక్షర శైలి
నా ఈ సమాదానానికి వాడబడింది
అక్షర మాల
ఇదంతా మీకు నచ్చాలనుకోవడం నా
అక్షర అంతరం
*~*~*~*
అక్షర ప్రేమికుడు 
మురళి ధర్మపురి
*~*~*~*~*~*~*~*~*~*

Leave your comments

Post comment as a guest

0
terms and condition.

Comments