మన్మథ బాయ్ దుర్ముఖి హాయ్

ప్రతి పండగా పురాణంతో ముడిపడింది
కానీ ఉగాది మాత్రం కాలంతో వచ్చింది
 
గురువెవ్వరు లేని కోయిల పాటలు 
సంగీతపు గాలులు మామిడి పూతలు 
 
ఎద్దు కొమ్ముల మధ్యన పొడిచే పొద్దులు
తుమ్మెద దాడులు పూజాతుల ముద్దులు
 
లేలేత కొమ్మలు వేప పూతలు 
కదిలే మేఘం రాల్చిన చినుకులు
 
మామిడి తోరణాలు పంచాంగ శ్రవణాలు
వసంతం ఓణీలు పరికిణీల పరిమళాలు
 
మాగిన మామిడి మధుర రసాలు
రేగడి ముంతల మీగడ పెరుగులు
 
సంధ్యా సూర్యులు మిణుకు తారలు
రేయి చంద్రులు మల్లెల విరుపులు 
 
మిణుగురుల దీపాలు అద్దిన సొబగులు
గిరులూ తరులు వెచ్చని ఉషోదయాలు

బాయ్ చెబుతూ మన్మథ రాలిన గతంతో వెళ్ళింది 
హాయ్ అంటూ దుర్ముఖి ఆరు రుచులతో వచ్చింది
 
తెలుగుతల్లి మా ఆరాధ్య దైవం
అన్నపూర్ణ మన భరత వర్షం 
*~*~*~*~*~*~*~*~*~*~*

Leave your comments

Post comment as a guest

0
terms and condition.

Comments