నీలోని ప్రతివాది లోక విరోధి

జంగమ దేవర శివుడు అంతర్ముఖుడు
యోగనిష్ఠన అంతరంగాన్ని సంస్కరిస్తాడు
జీవాత్మ పరమాత్మ ద్వైతతత్వాన్ని వీడు
ఒక్కటే అనే అద్వైత సాకారం కలిగిస్తాడు

మార్గసూచి మహా విష్ణువు బహిఃర్ముఖుడు
బాహ్యసవాళ్ళ నియంత్రించే స్థితి కారకుడు
లౌకిక సమస్యల దాటించి లక్ష్యం చేరుస్తాడు
అలౌకిక ఆనందాన్ని అమితంగా కురిపిస్తాడు

తరతమ భేదాలు లేని తెలియని చిన్నతనం
సామాజిక స్పృహ వచ్చి అంతరాల పెద్దతనం
నేనెవరు అన్న అన్వేషణే ఆధ్యాత్మిక సాధనం
తనను తాను తెలుసుకోవడమే దైవారాధనం

ఉత్తమగ్రంథం ప్రపంచం వివేకిమౌనం మూర్ఖత్వం
అన్ని మోసాలలో ఆత్మవంచనే అధమాధమం
నేడు కాలక్షేపం సయితం అయింది యాంత్రికం
అర్థం గడిస్తున్నా మనిషి బ్రతుకు అర్ధశూన్యం

నీలోని ప్రతివాదియే అసలైన లోక విరోధి
వాణ్ని గెలిస్తే నువ్వే సిసలైన యదార్థవాది
*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*

Leave your comments

Post comment as a guest

0
terms and condition.

Comments