తెలుగులో మాట్లాడేవాడే గొప్పవాడు

ప్రేమికులు కళ్ళతో మాట్లాడుకుంటారు
కవులు కలంతో మాట్లాడుతుంటారు
ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే మాత్రం
మరి ఇంగ్లీషులోనే మాట్లాడుకుంటారు
 
దణ్ణం పెట్టే చేతుల్తో అన్నం పెట్టేవాడు గొప్పవాడు
కష్టపడి పనిచేస్తూ, ఇష్టపడి పనిచేసేవాడు గొప్పవాడు
తల్లి ఋణం, తెలుగు తల్లి ఋణం తీర్చేవాడు గొప్పవాడు
ఇంగ్లీషు వచ్చినా సరే తెలుగులోనే మాట్లాడేవాడు గొప్పవాడు
 
తెలుగు వినను, తెలుగు కనను, తెలుగు అనను అనేవాడు కాడు గొప్ప్పవాడు
తెలుగు రాకుంటే ఆస్తిలో చిల్లిగవ్వ రాదు అని వీలునామా రాసేవాడు గొప్ప్పవాడు
విరామంలో లంచ్ తిని విరామం లేకుండా లంచం తినేవాడు కాడు గొప్పవాడు
ఇంగ్లీషు వచ్చినా సరే తెలుగులోనే మాట్లాడేవాడు గొప్ప్పవాడు
 
`నాకు తెలుగంటే చాలా ఇష్టం, వై డోంట్ యు బిలీవ్ మి` అనే ఆమె కాదు గొప్పది
అన్నంలో తెల్లవెంట్రుక తీయటం కష్టమౌతుందని జుట్టుకు రంగు వేసుకునే అమ్మ గొప్పది
`నేను అస్సలు దేవుణ్ని నమ్మను, గాడ్ ప్రామిస్` అనే ఆమె కాదు గొప్పది
నేను నీ పతిదేవుణ్ని అని భర్త అంటే, మా నాన్న వసుదేవుడు అనే బార్య గొప్పది
 
ఇంగ్లీషు వచ్చినా సరే తెలుగులోనే మాట్లాడే ప్రతీ యువతి గొప్పది
*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*

Leave your comments

Post comment as a guest

0
terms and condition.

Comments