నాడు - నేడు…….

నా బాల్యం చాలా బాగుండేది
మళ్ళీ వస్తే ఎంత బాగుండేది
బుజ్జిగాడితో కలిసి మళ్ళీ స్కూలు కెళ్ళేవాణ్ని
యల్.కె.జి పూర్తి చేసి యు.కె.జి చదివేవాణ్ని
 
మీ అమ్మకు చెప్తా అనేది అప్పుడు ఓ పెద్ద బెదిరింపు
అమ్మ కనిపించేంత దూరంలొ ఉన్నా ఆమె వద్దకు లంఘింపు
తప్పటడుగులు చూసి సంబర పడే పెద్దవాళ్ళు
తప్పులు మన్నించి సరిదిద్దే ఇంట్లోవాళ్ళు
 
పండగ బట్టల్లో మిణుగురు పురుగై మెరిసేవాణ్ని
ఇంటా బయటా రంగుల పక్షిలా ఎగిరేవాణ్ని
నాన్న దుప్పట్లో వెచ్చగా సేద తీరేవాణ్ని
అమ్మ చేయినే మెత్తగా వాడి పడుకునే వాణ్ని
 
నలుగురు చూస్తే ఏమనుకుంటారు అని అమ్మ అంటే ఆ నలుగురు ఎవరు అనుకునేవాణ్ని
వెన్నెల్లో ఉరుకుతున్నపుడు ఎటు ఉరికినా చంద్రుడు నన్నే అనుసరిస్తున్నాడనుకునేవాణ్ని
మా పల్లెటూళ్ళో స్నేహితులకు చేతి గడియారాలుండేవి కావు, కానీ దోస్తులకై టైం ఉండేది
ఇప్పుడు నా మిత్రులందరికీ ఖరీదైన వాచ్-లున్నాయి, కానీ కలవడానికి టైం ఎక్కడిది
 
నాకో బంగారు జీవితం ఉండేది, ఆ తరువాత ఇంటర్నెట్ వచ్చింది
చాటింగ్, డౌన్-లోడు, మెసేజ్-లతో బిజీగా ఉన్నా
కూర్చున్న చోటే క్రికెట్, ఫుటీలు ఆడి హైస్కోరు చేస్తున్నా
ఎవరిదైనా అలికిడి కాగానే కంప్యూటర్-లో హిస్టరీ క్లియర్ చేస్తున్నా
 
చాక్లెట్ అంకుల్-లకు, బిస్కట్ ఆంటీలకు కబుర్లు చెబుతున్నా
చదువు తప్ప వేరే ధ్యాస ఉండేది కాదు, కబడ్డీ కోకో గిల్లిదండల్లో గడిచేది దినం
ఫేస్ బుక్ లో స్టేటస్ పెట్టేది లేదు, స్నేహితులతో ఆటల్లోనే ఆనందం
 
ప్రతి అమ్మాయి ముంతాజ్-లా కనిపించేది కాదు,
రోజుకో తాజ్-మహల్ కట్టాలనిపించేది కాదు
ల్యాండ్-లైన్ వస్తే ఇంట్లోకెళ్ళాలి మొబైల్ ఐతే బయటకెళ్ళాలి
అవసారాన్ని బట్టి రెండు రెండు మొబైల్ ఫోన్లను పోషిస్తున్నా
 
అనేక అశ్లీల చిత్రాలను ఆండ్రాయిడ్ ఫోనులో చూస్తున్నా
మిస్డ్ కాల్స్, రాంగ్ డయల్స్ ప్రేమాయణాలు వింటున్నా
వైర్-లెస్-లో మాటలు మచ్చట్లు
ఇప్పుడంతా బ్లూ టూత్ సంబంధాలు
 
దగ్గరున్నంత వరకే కనెక్ట్ అయి ఉంటారు
దూరం పోగానే నెట్వర్క్ డిస్-కనెక్ట్ అవుతారు
ఒకేసారి కలిసి మరణించిన రోమియో జూలియెట్-ల ప్రేమ కన్న
ఒక జీవితకాలం కలిసి బతికే మా తాత నానమ్మల ప్రేమే మిన్న
అమ్మా నాన్నల వేళ్ళతో నడక నేర్చాను
వాళ్ళు నడవలేనప్పుడు వేళ్ళు అందిస్తాను
 
నా బాల్యం చాలా బాగుండేది
మళ్ళీ వస్తే ఎంత బాగుండేది
బుజ్జిగాడితో కలిసి మళ్ళీ స్కూలు కెళ్ళేవాణ్ని
యల్.కె.జి పూర్తి చేసి యు.కె.జి చదివేవాణ్ని
నా బాల్యం చాలా బాగుండేది
మళ్ళీ వస్తే ఎంత బాగుండేది
*~*~*~*~*~*~*~*~*~*~*

Leave your comments

Post comment as a guest

0
terms and condition.

Comments