
ముందులా లేవు…….
నువ్వు ముందులా లేవు అన్నది తాను
నీవు లేని నేను ఎలా ఉంటాను అన్నాను నేను
మరొకరి కళ్ళళ్ళో దివ్వెవై వెలగమంది తాను
ఏ కళ్ళూ నీ కళ్ళకు సరి రావన్నాను నేను
నేనంటే ఎందుకు అంతలా పడిచస్తావ్ అన్నది తాను
మరవడానికి నేను రాయిని కాను అన్నాను నేను
నేను మోసం చేశానని తెలియదా అన్నది తాను
మంచిని వెతుక్కోవడం మానేసా నన్నాను నేను
నన్ను పూర్తిగా మర్చిపోతే నీకే మంచిది అన్నది తాను
వాస్తవం నువ్వు కలవు కావు మరవడానికి అన్నాను నేను
పైలా పచ్చీసు కాలం పది కాలాలుండదు అన్నది తాను
మళ్ళీ నీలాంటి కళ్ళు పడకుంటే అదే పదివేలు అన్నాను నేను
*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*
Leave your comments
Post comment as a guest