చెప్తే వినడు వినిపించుకోడు...

కలం వదిలేస్తడు పడక గదిలో
వెతుకుతూ ఉంటడు వంటింట్లో
ఎక్కడి వస్తువు అక్కడ లేదంటడు
చెప్తే వినడు వినిపించుకోడు
 
ఫ్లైట్ పన్నెండు గంటలకు
బయల్దేరేది ఆరు గంటలకు
పాస్-పోర్ట్ మరిసి మద్యలో వెనక్కు
చెప్తే వినడు వినిపించుకోడు
 
సినిమా మధ్యలో లేస్తడు
కారు తాళం చెక్-చేసి వస్తడు
కద మిస్ అయ్యిందని గొణుగుతుంటడు
చెప్తే వినడు వినిపించుకోడు
 
బార్య పేరు కూడ మర్చిపోయిండు
డార్లింగ్, ఏమోయ్ అని మొదలు పెట్టిండు
మతిమరుపును ఓ స్టైల్-లాగ మార్చిండు
చెప్తే వినడు వినిపించుకోడు
 
కళ్ళ జోడు పెట్టుకుంటడు జేబుల్లో
కలయ వెతుకు తుంటడు గదుల్లో
ఎక్కడ పెట్టింది అక్కడే వెతకాలంటడు
చెప్తే వినడు వినిపించుకోడు
 
రికార్డ్ చేసుకుని మరీ టివి చూస్తుంటె
వచ్చి ఏం వండినవ్ ఈ పూటకు అంటడు
వంటగదిలో చూసుకోమంటె రా వడ్డించమంటడు
చెప్తే వినడు వినిపించుకోడు
 
ప్యాంట్ వేసుకుని జిప్ పెట్టడు
చెబిటే కోపంగా జూస్తడు
తెలుసులే అని ధబాయిస్తడు
చెప్తే వినడు వినిపించుకోడు
 
వరండాలో టీవీ చూస్తూ పిల్లలు
తలుపు చాటునుండి రమ్మని సైగలు
సమయం కాదన్నా మానడు సరసాలు
చెప్తే వినడు వినిపించుకోడు
*~*~*~*~*~*~*~*~*~*~*

Leave your comments

Post comment as a guest

0
terms and condition.

Comments