తెలుగును కాపాడుదాం

కుర్రకార్ల ప్రేమ పరిభాష

ఆధునికుల మిశ్రమ భాష

పరభాషీయుల సంకర భాష

వివిద ప్రయోగాల తెలుగు భాష

నాది భారత దేశం

తెలుగు నా మాతృభాష

ఇంగ్లీషు నా విదేశీ భాష

నేను మాట్లాడేది తెంగ్లీషు భాష

నిరంతరం మారుతున్న భాష

ప్రవాహమై పారాలి మాతృభాష

తెలుగులో మాట్లాడితే అతి చులకన

ఆంగ్లంలో పలకరిస్తే ప్రత్యేక ఆకర్షణ

వచ్చీ రాని తెలుగైతే మరింత ఆదరణ

తెలుగింట తెలుగు తల్లికే నిరాదరణ

తెలుగు సభల్లో తెలుగేతరులకు ఆహ్వానాలు

నలుగురి కోసం అంగ్రేజీలో ప్రసంగాలు

అన్య భాషీయుల మెప్పులకోసం ఆరాటాలు

తెలుగు హోదాకై పరభాషలో విన్నపాల

ప్రపంచ తెలుగు మహాసభలొస్తున్నాయి యేటేటా

తెల్లవారితే పరభాషా సంభాషణలే ప్రతి నోటా

అమ్మా నాన్న మమ్మీ డాడీ లైనారు ఇంటింటా

మన భాష మరుగవకుండా వేయాలో కొత్త బాట

తెలుగు రాయలేకపోతే ఫర్వాలేదు మరి

తెలుగులో మాట్లాడుకుంటేనైనా సరి

తేనెలూరు తెలుగును కాపాడుకుందాం

ఇళ్ళల్లోనైనా తెలుగును బ్రతికించుకుందాం

 

*~*~*~*~*~*~*~*~*~*~*~*

Leave your comments

Post comment as a guest

0
terms and condition.

Comments