Eenadu Telugu Velugu

ఈనాడు వారి తెలుగు వెలుగు సంచికలో శ్రీమతి సి. హెచ్. లక్ష్మి గారి వ్యాసం:  భాష, తల్లిదండ్రులు, మతం వంటి విషయాలతో ప్రారంభించి ప్రతిరోజూ తన అనుభవంలోకి వచ్చిన అనేక విషయాల మీద శాయరీలు రాశారు.

ఒకప్పుడు తెలుగునాట ఇంటింటికో కవి ఉండేవారట. ఇప్పుడు ఇక్కడ కవుల సంఖ్య బాగా తగ్గింది. కానీ ప్రవాసాంధ్రుల నుంచి కవులు, రచయితలు ఎక్కువగా వస్తున్నారు. ఇది ఆనందించదగిన ప్రణామమే. ఆస్ట్రేలియా సందర్శించివచ్చే మిత్రులద్వారా సుపరిచితమైన కవి మురళి ధర్మపురి. తన తెలుగు శాయరీలను ఇంగ్లీషు, హిందీ భాషల్లోకి అనువదించి ఒక్కో పుటలో మూడు భాషల శాయరీలను(కవితలను) రంగుల్లో ముద్రించారు. అలా 52 శాయరీలు అందించారు మురళి ధర్మపురి తన మురళి ముషాయిరాలో. న్యూజిలాండ్, అమెరికా వంటి దేశాల్లో పనిచేసి ఆస్ట్రేలియాలో స్థిరనివాసం ఏర్పరుచుకున్న మురళి భాష, తల్లిదండ్రులు, మతం వంటి విషయాలతో ప్రారంభించి ప్రతిరోజూ తన అనుభవంలోకి వచ్చిన అనేక విషయాల మీద శాయరీలు రాశారు. ఈ శాయరీలన్నీ కవి అనేక సందర్భాల్లో వెలిబుచ్చినవే అయినా వీటి వెనుక కవికున్న గాఢమైన సామాజిక చింతన పాఠకుల అనుభవంలోకి వస్తుంది.

EenaduTeluguVeluguArticle

Leave your comments

Post comment as a guest

0
terms and condition.

Comments